నేటి యువతలో వెదజల్లుతున్న మానవత్వం..

  • ” ఓ అమ్మ ఆక్రందన” కథనం పై కలెక్టర్ అభినందన..
  • డీసీపీయు జాగరపు విజయ బృందానికి సత్కారం…
  • ఐటీఐ విద్యార్థి పరమేశ్వర్ కు కలెక్టర్ భరోసా..

కాకినాడ మన న్యూస్ (అపురూప్) కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలితో, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకుని అధికారుల సహాయంతో రక్షణ కల్పించిన విషయం ” ఓ అమ్మ ఆక్రందన…”అనే కథనం ద్వారా తెలిసిందే… వివరాల్లోకి వెళితే…కాకినాడ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్) పరిధిలో బాలల సంరక్షణ కోసం పనిచేస్తున్న బృందాన్ని జిల్లా కలెక్టర్ షన్మోహన్ గురువారం కలెక్టరేట్లో ఆయన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్ అధికారిని జాగరపు విజయ తో పాటు కౌన్సిలర్ బి.దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్. చినబాబు, ఔడబ్ల్యూ ఆర్. దుర్గ భవాని, ఐటిఐ విద్యార్థి పరమేశ్వర్ ల ను ఘనంగా సత్కరించారు. మంచిపని చేశారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా డిసిపియు బృందంతో కలెక్టర్ సన్ మోహన్ సగిలి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో విధినిర్వాహణలో ఇంతే నిబద్ధత కొనసాగిస్తూ జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి కుమారి కె.విజయ కుమారి, డిసిపిఓ సిహెచ్. వెంకట్రావు ల సహకారంతో ఉద్యోగ కార్యకలాపాలతో పురోగతి సాధిస్తున్నామని డీపీసీయు బృందం అన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థి పరమేశ్వర్ తో మాట్లాడుతూ, చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగం పొందేందుకు తమ సహకారం అందిస్తామని తెలిపారు. డీపీసీయు అధికారిని జాగారపు విజయ మాట్లాడుతూ, ఈ నెల 20న కాకినాడ బస్టాండ్ సమీపంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ తల్లి తన నాలుగేళ్ల, రెండేళ్ల, నాలుగు నెలల వయసున్న ఇద్దరు బాలలు, ఒక బాలికతో హోరు వానలో రోదిస్తుండగా వారిని గమనించిన కాకినాడ ప్రభుత్వ ఐటిఐ కళాశాల లో చదువుతున్న పరమేశ్వర్ అనే విద్యార్థి డిసిపియు బృందానికి చారవాణి ద్వారా సమాచారం అందించగా, విద్యార్థి సమాచారం మేరకు తక్షణమే డీసీపీయు ప్రొటెక్షన్ అధికారిని జాగరపు విజయ ఆమె బృందం తక్షణమే స్పందించి తల్లి బిడ్డలను చేరుకొని వారి నుండి విచారణ చేపట్టి కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడినుండి బాలల సంక్షేమ సమితి ఆదేశాల మేరకు సఖి వన్ స్టాప్ సెంటర్ కు తరలించి సంరక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం తల్లి బిడ్డల సంరక్షణ బాధ్యతలను బాలల సంక్షేమ సమితి పర్యవేక్షిస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ తల్లి బిడ్డల హృదయ విదారక స్థితి తెలుసుకొని చలించిపోయారని, వారిని రక్షించి ఆసుపత్రి మరియు హోమ్ కి కు తరలించిన డీపీసీయు బృందాన్ని కలెక్టర్ కార్యాలయంలో అభినందించడం జరిగిందని అన్నారు. నిర్వహిస్తున్న బాధ్యతకు మరింత ప్రోత్సాహం అందించిన కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలికి ఆమె ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా