యోగా డేని విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః యోగాంధ్రా 2025 కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌డంలో భాగంగా శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోగా కార్య‌క్రమాన్ని బుధ‌వారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. యోగా మాస్ట‌ర్లు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో యోగ ఆస‌నాల‌ను ప్రాక్టీస్ చేయించారు. సుమారు 40 నిమ‌షాల పాటు యోగా ప్రాక్టీస్ జ‌రిగింది. విశ్వ‌మంతా యోగాతో ఆరోగ్యం నినాదంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు విశాఖ‌ప‌ట్నంలో అంత‌ర్జాతీయ యోగా డేను ని ఐదు ల‌క్ష‌ల మందితో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగే యోగా డే లో పాల్గొంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. సూర‌త్ లో 2023లో కోటి యాభై మూడు ల‌క్ష‌ల మందితో సామూహిక యోగా నిర్వ‌హించి గిన్నీస్ రికార్డ్ నెల‌కొల్పార‌ని ఆయ‌న చెప్పారు.ఈ రికార్డ్ బ‌ద్దులు కొట్టేలా రాష్ట్ర ప్ర‌భుత్వం రెండు కోట్ల మందితో సామూహిక యోగా ను నిర్వ‌హిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. యోగాను నిత్యం ప్ర‌తి ఒక్క‌రు గంట పాటు చేయాల్సిన అవస‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. సామూహిక యోగా లో ప్ర‌జ‌లంతా పాల్గొని రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప చేయాల‌ని ఆయ‌న కోరారు.
జూన్ 1 వ తేది విశాఖ‌ప‌ట్నంలో11వ అంత‌ర్జాతీయ యోగా డే ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణయించిన‌ట్లు క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్ తెలిపారు. ఇందులో భాగంగా బుధ‌వారం నుంచి జూన్ 21వ వ‌ర‌కు యోగా మాసంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. యోగా ను తిరుప‌తి జిల్లాలో ప్ర‌తి మూల‌కు తీసుకెళ్ళాల‌ని ఆయ‌న కోరారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు యోగా ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాల‌ని ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చాయిని ఆయన తెలిపారు. మన సంస్కృతి,సాంప్ర‌దాయ‌లు ప్ర‌తిబంభించేలా యోగా ను ప్ర‌మోట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. యోగాను కేవ‌లం జూన్ 21 వ తేది మాత్రానికే ప‌రిమితం చేయ‌కుండా నిత్యం చేయాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కోరారు. కాగా యోగాను ప్రతి ఒక్క‌రు జీవితంలో ఒకభాగం చేసుకోవాల‌ని ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాజు అన్నారు. యోగాను ప్ర‌పంచవ్యాప్తంగా యోగాకు ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని ఆయ‌న తెలిపారు. యోగాపై ప్ర‌జ‌ల్లో పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాల్సి అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో యాద‌వ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ న‌ర‌సింహ యాద‌వ్, గ్రీన‌రి, బ్యూటిఫికేష‌న్ కార్పోరేష‌న్ ఛైర్ ప‌ర్శ‌న్ సుగుణ‌మ్మ‌, డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణ‌, బిజేపి తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జీ అజ‌య్ కుమార్, వైస్ ఛాన్స‌ల‌ర్ ఉమా, జాయింట్ క‌లెక్ట‌ర్ శుభం స‌బ‌న్స‌ల్, డి ఆర్ ఓ, ఆర్డీఓ, మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ చ‌ర‌ణ్ తేజ్ రెడ్డి, స‌హాయ క‌మిష‌న‌ర్ అమ‌ర‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా