
మన న్యూస్, నెల్లూరు ,మే 20: నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందించిన సంపూర్ణ సహకారంతో ఈ నెలలో జరిగిన ఈసెట్ -2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో(ఈసెట్ హల్ టిక్కెట్ నెంబర్ :- 75180020060) జర్నలిస్ట్ రేవూరు వెంకటస్వామి కుమార్తె రేవూరు నిషిత స్రవంతి రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంకును సాధించింది. అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డికి మా కుటుంబం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సీనియర్ జర్నలిస్ట్ రేవూరు వెంకటస్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా మాకు అన్ని విధాలుగా సహకారం అందించిన నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
