సార్… ట్రాన్స్కో టవర్ల వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు జరిగాయి మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?

మన న్యూస్ ,నిజాంసాగర్ ( జుక్కల్) ఒక శాఖకు చెందిన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉంటుంది. శాఖ కాపాడుకోవడానికి అధికారులు నియమించబడతారు. అధికారులు ఆఫీసులో కూర్చుండి, తమకు లాభం వచ్చే పనులు చూసుకుంటున్నారు., శాఖ పరిధిలోని ఆస్తుల రక్షణకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కానీ కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం హసన్ పల్లి శివారులోని నిజాంసాగర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద జెన్కో సంబంధించిన భూమిలో విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేశారు. కొంతమంది ఈ భూమిలో నుంచి మొరం తవ్వకాలు చేపట్టడంతో, ప్రస్తుతం టవర్స్ ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంపై మన న్యూస్ దినపత్రిక ట్రాన్స్కో ఏ, ఈ నరహరి దృష్టికి తీసుకువెళ్లగా ఏ ఈ నరహరి, మన న్యూస్ దినపత్రిక మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది మన న్యూస్ దినపత్రిక …. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ట్రాన్స్కో ఏ, ఈ. నరహరి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మన న్యూస్ దినపత్రిక … సార్ నేను మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి మాట్లాడుతున్నాను. ట్రాన్స్కో ఏ. ఈ.. విషయం చెప్పండి మన న్యూస్ దినపత్రిక ప్రతినిధి… సార్.. నిజాంసాగర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్తు టవర్ల వద్ద మొరం త్రవ్వకాలు చేపట్టడంతో విద్యుత్తు టవర్స్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్కో… ఎవరు త్రవ్వారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మన న్యూస్ దినపత్రిక… సార్.. మావద్ద ఉన్న ఆధారంతోనే వార్తలు రాశాం. ట్రాన్స్కో… ఎప్పుడు రాశారు.? మన న్యూస్ దినపత్రిక.. ఆరు నెలలకు క్రితం. ట్రాన్స్కో…. కాదు అంతకంటే ముందే తవ్వకాలు జరిగాయి. నేను విధుల్లోకి రాకముందు త్రవ్వకాలు చేపట్టారు. మన న్యూస్ దినపత్రిక… అక్రమంగా జెన్కో భూమిలో మొరం త్రవ్విన వారిపై ఇలాంటి చర్యలు తీసుకుంటారు ? ట్రాన్స్కో… ఎవరి తవ్వారు? మీరు చెప్పగలుగుతారా? మన న్యూస్ దినపత్రిక… సార్.. ఎక్కడ ఏమి జరిగినా వార్తలు రావడం మా పని. దానిపై మీరు విచారణ జరిపి చర్యలు చేపట్టవలసిన బాధ్యత మీది ట్రాన్స్కో… మీరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. అప్పుడు చర్యలు తీసుకుంటాం. ప్రతి వార్తకు విలేకరులు సంబంధిత శాఖకు అక్రమాలపై ఫిర్యాదు చేస్తారా? ట్రాన్స్కో… ఎవరు ఫిర్యాదు చెయ్యనిది, నేను ఎట్లా చర్యలు తీసుకుంటా క్షేత్రస్థాయిలో మీరు వెళ్లి విచారణ చేస్తే అక్రమంగా మొరం తవ్విన వారి వివరాలు తెలుస్తాయి కదా. ట్రాన్స్కో.. ఎవరు చెప్పడం లేదు. నేను ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? టవర్స్ కింది భాగం లో మొరం తవ్వడం వల్ల ,అవి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. వాటి మరమత్తులకు కంకర, ఇసుక వేసి ఇప్పటివరకు ఇంకా పనులు చేపట్టడం లేదు. ఈ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు. ట్రాన్స్కో.. పనులు ఏజెన్సీకి అప్పగించాం.. ఈ పనులు విషయంపై ప్రత్యేక శాఖ ఉంటుంది వారికి వివరాలన్నీ వారికే తెలుస్తాయి. ఇదండీ అధికారుల పనితీరు.. ఫలానా దగ్గర అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతుంటే దానివల్ల, ట్రాన్స్కో శాఖకు చెందిన విద్యుత్ టవర్స్ ప్రమాద స్థాయి పరిస్థితికి చేరుకున్నాయి. ట్రాన్స్కో శాఖ , జెన్కో శాఖ భూమిలో విద్యుత్తు టవర్స్ వేశారు. కొంతమంది మొరం మాఫియా టవర్స్ వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు జరపడంతో ప్రస్తుతం టవర్స్ కింది భాగాన నేల కోతకు గురై టవర్స్ కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ట్రాన్స్కో అధికారులు మేల్కొని తక్షణం పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టవలసి ఉంది. వర్షాకాలం వస్తే టవర్స్కు ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది.

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.