సర్వేపల్లి నియోజకవర్గంలో రూ 120 కోట్లతో 685 అభివృద్ధి పనులు ……..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ ,సర్వేపల్లి ,మే 20:*వైసీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం నలిగిపోయింది.*అరాచకాలకు పాల్పడిన వ్యక్తి ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నాడు..50 రోజులుగా పత్తా లేకుండా పారిపోయాడు*కాకాణి లాంటి వ్యక్తిని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్న వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది.*వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణ మండపంలో జరిగిన సర్వేపల్లి మినీ మహానాడులో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*డేగపూడి – బండేపల్లి కాలువ నిర్మాణం, సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనుల పూర్తి, తిరుమలమ్మపాళెం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, కండలేరు ఎడమ కాలువ 18R, 19Rల అనుసంధానం, సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ తదితర అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు.తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి మహానాడుకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భముగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……..వైసీపీ రాక్షస రాజ్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు నరకం అనుభవించారు అని అన్నారు.ఆస్తులు కోల్పోయారు. అక్రమ కేసులు ఎదుర్కొన్నారు..జైళ్లకు పోయారు..రౌడీషీట్లు బనాయించి వేధించినా వెనకడుగు వేయలేదు అని అన్నారు.కష్టాలను ఎదురునిలిచి, పోరాటాలు సాగించి నన్ను మూడోసారి అసెంబ్లీకి పంపారు అని సర్వేపల్లి టీడీపీ శ్రేణుల రుణం తీర్చుకోలేనిది అన్నారు.ఓ వైపు అరాచకాలు, అవినీతి, దోపిడీ, మరోవైపు అభివృద్ధి నిలిచిపోయి నియోజకవర్గం నలిగిపోయింది అని అన్నారు.తిరుమలమ్మపాళెం హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశాం..వైసీపీ అధికారంలోకి రాగానే బ్రిడ్జి విషయాన్ని గాలికొదిలేశారు అని తెలిపారు.2015లో వరదలు వచ్చిన సమయంలో సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట ప్రమాదకర పరిస్థితికి చేరుకోవడాన్ని చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు..రిజర్వాయర్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేస్తే ఆ పనులనూ ఆపేశారు అని అన్నారు.డేగపూడి – బండేపల్లి కాలువదీ అదే పరిస్థితి,పొదలకూరులో రూ.4.90 కోట్లతో నిర్మించిన మెగా వాటర్ ప్లాంటును తుప్పు పట్టించారు అని అన్నారు.పొదలకూరులో పెంచలస్వామిని, నేదురుపల్లిలో రవీంద్ర నాయుడు, హరిబాబును, జంగాలపల్లిలో రాజగోపాల్ సోదరులను, వెంకటాచలం వడ్డిపాళెంలో యనమల రాజేంద్రతో పాటు ఐదుగురు అనుచరులను, మండపంలో సర్పంచ్ గా పోటీ చేసిన కృష్ణతో పాటు నలుగురు అనుచరులను జైల్లో పెట్టించాడు అని అన్నారు.నాపైనా 18 అక్రమ కేసులు పెట్టించాడు. ఈ కేసుల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాడు అని అన్నారు.కాకాణిలాగా నీచమైన, దుర్మార్గమైన భాషను మాట్లాడేవారు రాజకీయాల్లో ఎవరూ ఉండరు అని అన్నారు.ఇన్ని ఘన కార్యాలు చేసిన పెద్ద మనిషి ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి అధ్యక్షుడంట అని తెలిపారు.50 రోజులుగా ఎక్కడున్నాడో తెలియదు..ఏమైపోయాడో అర్థం కావడం లేదు అని అన్నారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్ని భూముల రికార్డులు మార్చారో అంతుపట్టడం లేదు..నియోజకవర్గాన్ని భూకుంభకోణాలకు అడ్డాగా మార్చారు అని అన్నారు.పొదలకూరు మండలం మరుపూరులో ఐటీ కట్టే కోటీశ్వరులకు 60 ఎకరాల ప్రభుత్వ భూములను దారాధత్తం చేశారు అని అన్నారు.2024 ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే కొద్ది గంటల ముందు రామదాసుకండ్రిగలో 57 ఎకరాల పేదల భూములను అల్లుడి పేరుతో రాయించేశాడు అని తెలిపారు.కొమ్మలపూడిలో హైవే పక్కన 19 ఎకరాలను శిష్యుడి పేరుతో రికార్డులు మార్చేశారు అని అన్నారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పిందల్లా చేసి తహసీల్దార్లు స్వాతి, వీర వసంతరావు, ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయ్యారు అని అన్నారు.కాకాణి పాపాలకు బలైన వారి సంఖ్యకు లెక్కే లేదు అనేక మంది జైళ్లకు కూడా పోయారు అని అన్నారు.ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు 50 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు అని అన్నారు.కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్తులు, బినామీలతో కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా నరకం అనుభవిస్తున్నాడుఅని అన్నారు.2016లోనూ నా కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులున్నాయంటూ నకిలీపత్రాలు సృష్టించాడు. అప్పుడు కూడా రెండు నెలలు కనిపించకుండా పోయి సుప్రీం కోర్టుకు పోయి కండీషన్ బెయిల్ తెచ్చుకున్నాడు అని అన్నారు.ఇప్పుడు కూడా వరదాపురంలో వందల కోట్ల విలువైన క్వార్ట్జ్ కొల్లగొట్టి పిరికిపందలా పారిపోయాడు అని అన్నారు.ఇలాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్న వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. జగన్ రెడ్డికి ఇంతకంటే మనిషి దొరకలేదా అని తెలియజేశారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//