

మన న్యూస్, నారాయణ పేట:– జిల్లా పరిదిలోని పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు గాను రూ.2.50 లక్షల చెక్కును మంగళవారం ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు హైదరాబాదులోని ఫౌండేషన్ కార్యాలయంలో రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం గతంలో చత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు తమను కలిసి విన్నవించారని, వారి విజ్ఞప్తి మేరకు ఛత్రపతి శివాజీ విగ్రహానికి అయ్యే రూ.2.50లక్షలను పూర్తిగా తామే భరిస్తూ విగ్రహాన్ని ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కుంటి సాయికుమార్, కుంటిపాప ఆంజనేయులు, బేత్మీ నరేష్, చాకలి ఆంజనేయులు, నీరటి బాలరాజు, ఎల్లంగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.