

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్,సింగీతం,గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.గున్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగి రమేష్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికీ లబ్ధిదారులకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు.ఈ కార్యక్రమంలో నాగభూషణం,ఖాలీక్, మల్లయ్య గారి ఆకాష్,శారద,రపీ,సవైయి సింగ్,హతిక్,మోహిన్,తదితరులు ఉన్నారు.
