

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లె పంచాయతీ బండమీదఇండ్లలో ఉన్న శ్యామల, గంగాధర్ కుటుంబంపై శనివారం రాత్రి పిడుగు పడి ఇల్లు ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించడంతో వెదురుకుప్పం మండలం టిడిపి నేత క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కి తెలియజేయడంతో థామస్ ఆదేశాల మేరకు వెదురుకుప్పం టిడిపి నేత మోహన్ మురళి, బూత్ కమిటీ కన్వీనర్ పోటుగారి శ్రీధర్ లు బాధిత కుటుంబానికి బియ్యం, బట్టలు మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు థామస్ గారు బాదిత కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి రెడ్డి, పేట స్వామినాథరెడ్డి మధుసూదన్ రెడ్డి తిరుమలయ్య హరినాథ్ బండమీదఇండ్లు పెద్దలు యూత్ తదితరులు పాల్గొన్నారు