

మన న్యూస్ ,సర్వేపల్లి, మే 19:సర్వేపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి సోమవారం భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.జనసంద్రంగా మారిన వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణమండపం ప్రాంగణం.పెద్దాయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడుకు శ్రీకారం చుట్టారు .సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహానాడుకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, డాక్టర్ జెడ్. శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, దావా పెంచలరావు, జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

