
మన న్యూస్, నెల్లూరు ,మే 18:* వావింటపర్తి శ్రీవైష్ణవికి _ బి.టెక్ బంగారు పతకాలునెల్లూరు నగరానికి చెందిన వావింటపర్తి శ్రీవైష్ణవికి అనంతపురంలోని జవహర్లాల్ నెహ్ర టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU-A) బి-టెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో రెండు బంగారు పతకాలను ప్రకటించింది. ఈపతకాలను శనివారం ఆ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ బంగారు పతకాలను శ్రీవైష్ణవికి అందజేశారు. ఈ పతకాలతో పాటు బి-టెక్ అవార్డ్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికెట్నును అందజేశారు . శ్రీవైష్ణవి తల్లిదండ్రులు వావింటపర్తి కరుణానిధి, నాగలక్ష్మి. కరుణానిధి నెల్లూరు ఆంధ్రజ్యోతి దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తుండగా, తల్లి నాగలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, చరిత్రగల సీమ గ్రంథకర్త, తహసీల్దార్ స్వర్గీయ వావింటపర్తి కృష్ణారావు మనుమరాలు శ్రీవైష్ణవి . . బంగారు పతకాలను సాధించిన శ్రీవైష్ణవి మాట్లాడుతూ ఇస్రో లేదా డి ఆర్ డి ఓలో శాస్త్రవేత్తగా చేరి దేశానికి సేవలందిస్తానని చెప్పారు.
