

మన న్యూస్ ,నెల్లూరు, మే 18:తెలుగు వాడికి ప్రత్యేక రాష్ట్రం కావాలి… అప్పుడే వారి హక్కులను సాధించుకోగలరని… 58 రోజులు మొండి పట్టుదల తో కఠిన నిరాహారదీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని సంవత్సరం రోజులు వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వ నిర్ణయం అమోఘం… అని జనసేన నేత గునుకల కిషోర్ అన్నారు.భాషా ప్రయుక్త రేఖలతో భారత చిత్రపటాన్ని పునః నిర్మించిన శ్రీ పొట్టి శ్రీ రాములు భారత దేశ మెర్కాటర్ అని ప్రపంచ చిత్రపటాన్ని తయారు చేసిన జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్త ఫ్లెమిష్ ప్రశంసించారు.అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125 వ జయంతిని ఈ సంవత్సరం అంతా ఒక వేడుకలా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కూటమీ ప్రభుత్వం నిర్ణయాలతో నెల్లూరు జిల్లాలోని మే 18 ఆదివారం ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో కలెక్టర్ , రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ,నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ,పొల్యూషన్ బోర్డ్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,బిజెపి నాయకులు సురేందర్ రెడ్డి తో పాటు జనసేన పార్టీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి, నెల్లూరు సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్ , కూటమి ముఖ్య నాయకులు, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు జాతీయ నాయకులే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నాయకులు,వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పినన్నిసార్లు మరే నాయకులూ తెలుపలేదు అని తెలిపారు.వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభకు శ్రీ పొట్టి శ్రీరాములు ఆవిర్భావ సభ గా జరిపారు అని అన్నారు.అదేవిధంగా డిప్యూటీ సీఎం గా తొలి ప్రసంగం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళే విధంగా మహాత్ముల స్ఫూర్తిని స్పరింపజేసారు అని అన్నారు.భావితరాలకు మహాత్ముల స్పూర్తిని అందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం కుటుంబ ప్రభుత్వానికే చెల్లింది అని అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాసులు కావడం మనందరికీ గర్వ కారణం అని అన్నారు.ఆయన పేరు ఎప్పుడు గుర్తు చేసుకున్నా సంతపేటలోని చలమయ్య గుర్తుకొస్తారు,న్యూస్ పేపర్లో గాని మరే ఇతర వ్యాసాలలో గాని నెల్లూరుని శ్రీ పొట్టి శ్రీరాములుగా జిల్లాగా రాయాలని ఒకవేళ ఎవరైనా రాకపోతే వారికి ఫోన్ చేసి మరీ చలమయ్య తెలిపేవారు అని అన్నారు.దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలో లేరు కానీ వారి స్ఫూర్తిని ముందు తరాలకు తెలిసే లాగా నెల్లూరు జిల్లా నుంచి పొట్టి శ్రీరాములు జిల్లాగా ప్రతి ఒక్కరు ఉచ్చరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
