

మన న్యూస్ ,గూడూరు ,మే 18:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆశీస్సులతో డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కాలేజ్, LAQSH (లక్ష్) పౌండేషన్ సహాయ సహకారంతో, 20-05-2025 తేదీన అనగా ఈ మంగళవారం, ఉదయం 8 గంటల నుంచి గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈరోజు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ……ఈ మెగా జాబ్ మేళాలో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం,శ్రీ సిటీ, మేనకూరు సెజ్ , ఈఎంసి క్లస్టర్, తిరుపతి, మరియు చెన్నైలోని 21 బహుళ జాతీయ కంపెనీలలో 900 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఐదవ తరగతి పైన పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ మెగాజాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు. రిజిస్ట్రేషన్ లింకు: *https://naipunyam.ap.gov.in/user-registration*రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 19-05-2025. మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు.ఇతర వివరములు కొరకు సంప్రదించండి:+918639835953, 9700561225,9988853335.(కాల్ సెంటర్)ఈ కార్యక్రమంలో A.E.P హనుమంతరావు ప్రిన్సిపాల్ డి ఆర్ డబ్ల్యు, డిగ్రీ కాలేజ్, గూడూరు; కుడుముల లక్ష్మీనారాయణ భారత్ పెట్రోలియం డైరెక్టర్; కిషోర్ సిఐ, గూడూర్ రూరల్ సర్కిల్; మరియు ఆర్.లోకనాదం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ;గణేష్ ప్లేస్మెంట్ ఆఫీసర్, సునీల్ ,స్కిల్ హబ్ కోఆర్డినేటర్, .చెన్నయ్య, కోఆర్డినేటర్, ఏపీ ఎస్ఎస్డిసి, గూడూరు గమనిక: మెగా జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో ట్రైనీ (Trainee Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెనుఅని ఒక పత్రిక ప్రకటన ద్వారాఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా తెలియజేశారు.
