క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి** క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేయాలి* ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌కు శాప్ ఛైర్మ‌న్ విన‌తి

Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై రాష్ట‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగ‌ళ‌శారం ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌పై వీసీకి విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఖేలో ఇండియా నిధుల‌ను వినియోగించి యూనివ‌ర్సిటీలో క్రీడారంగం అభివృద్ధికి కావాల్సిన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరారు. అలాగే శ్రీ‌శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడాకారుల‌కు హాస్ట‌ల్ స‌దుపాయం లేద‌ని, క్రీడా వ‌స‌తి గృహం ఏర్పాటుకు స‌హ‌కరించాల‌ని కాంక్షించారు. తిరుప‌తి వేదిక‌గా క్రీడారంగం అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని, త్వ‌ర‌లో స్పోర్ట్స్ అకాడ‌మీని కూడా తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. స్పోర్ట్స్ అథారిటీ, యూనివ‌ర్సిటీ స‌మిష్టి కృషితో తిరుప‌తి జిల్లాలో క్రీడారంగాన్ని ప‌రుగులు పెట్టించ‌వ‌చ్చ‌ని కోరారు. దీనిపై వీసీ అప్పారావు బ‌దులిస్తూ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో స్పోర్ట్స్ హాస్ట‌ల్‌కు అనుకూలంగా ఉన్న భ‌వ‌నాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, అనుకూలంగా ఉంటే వాటిని త్వ‌రిత‌గ‌తిన ఆధునీకరించి డీఎస్ఏకు అంద‌జేస్తామ‌న్నారు. అలాగే క్రీడారంగాభివృద్ధికి యూనివ‌ర్సిటీ నుంచి పూర్తిస‌హాయ‌స‌హ‌కారాల‌ను అందిస్తామ‌ని శాప్ ఛైర్మ‌న్ కి వైస్ ఛాన్స‌ల‌ర్ హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీడీఓ స‌య్య‌ద్ సాహెబ్‌, ప‌లువురు అధ్యాప‌కులు పాల్గొన్నారు. *అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల విన‌తి..*తిరుపతి డీఎస్ఏకు విచ్చేసిన శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఉద్యోగుల సంఘ సభ్యులు శ్రీ‌శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో క‌లిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాప్ ఛైర్మన్ గార్కి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని శాప్ ఛైర్మన్ గారు వారికి హామీ ఇచ్చారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి