
గొల్లప్రోలు మే 17 మన న్యూస్ :- దేశ సైన్యానికి నాయకత్వానికి దైవ శక్తి తోడవ్వడానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని,జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను పురస్కరించుకుని గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ ఇంటివద్ద పీఠాధిపతులు నిర్వహించు అంబాయాగం,చండియాగం కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు వేలాది గా తరలి రావాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు.18 వతేది ఆదివారం నుండి మూడు రోజులు పాటు జరిగే ఈ దైవ కార్యక్రమంలో పాల్గోనుట ద్వారా దేశానికి, దేశ నాయకత్వానికి కొండంత ధైర్యం ఇచ్చినట్లు అవుతుందని నాగేశ్వరరావు తెలిపారు.