

మన న్యూస్ సింగరాయకొండ:- కలికివాయి గ్రామ సచివాలయం పరిధిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించి, గ్రామస్తులకు వేసవి జాగ్రత్తలు, వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు. తల్లులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, తగిన శీతల పానీయాలు తీసుకోవాలని సూచించారు. చేతులు కడుక్కోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలన్న సందేశాన్ని కూడా అందించారు. అదేవిధంగా, కలికివాయి 1, 2, 3 సెంటర్లలో సంసిద్ధత ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పిల్లల అసెస్మెంట్ ఫలితాలు, లెర్నింగ్ మేటీరియల్లను పిడీ హేనా సుజన్, సిడిపిఓ మల్లేశ్వరి, ఐటిసి ప్రథం వెంకటలక్ష్మి తదితరులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామస్థాయిలో ప్రాథమిక విద్యపై ఆసక్తి, ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. అంగన్వాడి కేంద్రం నుంచి పాఠశాలకు వెళ్లే పిల్లలకు సంసిద్ధత కల్పించడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
