

Mana News, సర్వేపల్లి :- , సర్వేపల్లి నియోజకవర్గంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించబడింది. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ఈ యాత్ర త్రివర్ణ పతాకాలతో సందడి చేసింది. ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటిచెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన ఇన్‌చార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.”భారత్ మాతాకీ జై” నినాదాలతో మార్మోగిన ముత్తుకూరు వాతావరణం, అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ దేశభక్తి భావాలను ప్రతిబింబించుకుంది. ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ప్రజల సమూహం కదం తొక్కిన ఈ యాత్ర, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పట్ల కృతజ్ఞతగా నిలిచింది.
