

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :- పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ.కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తిరంగా శాంతియుత ర్యాలీ చేపట్టారు.ఎమ్మెల్యే సత్యప్రభ కూటమి శ్రేణులతో పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ చేపట్టారు.భారత్ ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాదులపై జరిపిన దాడిలో అమరులైన సైనికుల మృతికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా మాజీ సైనికులు గుమ్ములూరు యతేంద్ర,కె సుబ్బారావులని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కశ్మీర్లో అమాయకులను బలితీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిన ప్రధాని మోదీ,ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.శత్రుదేశంపై ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.తీవ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యపై హర్షం వ్యక్తం చేశారు.ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ యుద్ధంలో భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి,కూటమి నాయకులు సింగిలిదేవి సత్తిరాజు,మేడిశెట్టి బాబీ,బొదిరెడ్డి గోపి,మూది నారాయణ స్వామి, వెన్నా శివ,పర్వత సురేష్, బద్ది రామారావు వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు,భారీ సంఖ్యలో మహిళలు,పట్టణ పౌరులు,నియోజకవర్గ కూటమి నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
