నెల్లూరులో మే 17న ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం నెల్లూరు జిల్లా ప్రధమ మహాసభలు

మన న్యూస్ , నెల్లూరు, మే 16:నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో మే 16 శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ విలేకరుల సమావేశం నిర్వహించినారు. నెల్లూరు నగరంలో మే 17 శనివారం జరుగు ఏ.పి.వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుంజి దయాకర్ మాట్లాడుతూ…… వడ్డెర్ల పై వడ్డెర మహిళల పై చిన్నారులపై అత్యాచారాలు లైంగిక వేధింపులు దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని, వాటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొని వచ్చి వడ్డెర్లకు, వడ్డెర వృత్తిదారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వృత్తి రీత్యా మరణించిన వారికి రూ 25 లక్షలు ఎక్స్ గ్రేస్ యో ప్రభుత్వం ఇవ్వాలని, వృత్తులలో నైపుణ్యత పెంచేదానికి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వృత్తిదారులకు శిక్షణ ఇవ్వాలని, చదువుకున్న యువతీ యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఉన్నతి చదువులు చదువుకోడానికి అవకాశం కల్పించాలని,ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతీ యువకులకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కంకర్ క్వారీలపై ,గ్రావెల్ గుట్టలపై , ఇసుక, మైనింగ్ గనుల పై వడ్డెరలకు హక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఎన్నికల సభలలో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కు 1000 కోట్లు నిధులు విడుదల చేసి విధులను ప్రకటించి తద్వారా వడ్డెర్ల కు వడ్డెర వృత్తిదారులకు సంక్షేమ పథకాలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి