

మన న్యూస్ బంగారుపాళ్యం మే-15:- చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పిఎంశ్రీ నిధులతో బంగారు పాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను,జిల్లా సమగ్రశిక్ష అధికారి వెంకటరమణ గురువారం అభినందించారు.
గురువారం మధ్యాహ్నం ఆయన, బంగారుపాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. పిఎంశ్రీ నిధుల వినియోగాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో వివిధ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు,నాణ్యత పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, హెచ్. ఎం. రాజేంద్ర ను ప్రశంసించారు. దాతల ద్వారా భోజనశాల నిర్మాణం చాలా బాగుందన్నారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులను ఆయన తనిఖీ చేశారు. బంగారుపాలెం ఉన్నత పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు,వనరులు సంపూర్ణంగా ఉన్నాయని అన్నారు.కార్యక్రమంలో ఎం ఇ ఓ రమేష్,ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు
