

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేలు పట్టణం లోని అబ్బరాతి వీధి సచివాలయం వద్ద రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమాచార హక్కు చట్టం-2005 గురించి ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, పాలనలో పారదర్శకత,జవాబుదారితనం పెంచి అవినీతి రహిత పాలనను ప్రజలకు అందించుటకు భారత పార్లమెంట్ లో జూన్ 15,2005 లో ఈ చట్టాన్ని ఆమోదించి అక్టోబర్ 12,2005 నుండి అమలుచేయడమైనది.ఈ చట్టం ద్వార ప్రజలు వారికి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని, బద్వేలు పట్టణ పరిధిలోని 23 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ఈ చట్టం పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం-2005 రక్షణ వేదిక కడప జిల్లా ఉపాధ్యక్షులు బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ, ఆర్.టి.ఐ చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిదని,సమాచారం కొరకు ప్రభుత్వ కార్యాలయాలలోని అధికారుల చుట్టూ తిరుగకుండా ఇంటినుండే ఒక్క దరఖాస్తు ద్వార 30 రోజుల్లో కావలసిన సమాచారం పొందవచ్చని దరఖాస్తు చేయుట,అప్పీలు చేయుట తదితర చట్టం లోని సెక్షన్లను గురించి వివరించి ,ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు పెట్టాలని, అతిముఖ్యమైన సెక్షన్ 4(1)b లోని 17 అంశాలతో కూడిన సమాచారాన్ని రిజిష్టర్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ప్రింట్ చేయించిన దరఖాస్తు ఫారాలను, అప్పీలు ఫారాలు హాజరైన ప్రజలకు సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి,మున్సిపల్ కార్యాలయ సిబ్బంది,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.