

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మీద అభిమానంతో తాను స్వయంగా ఎమ్మెల్యే ముఖ చిత్రాన్ని గీసి ఎమ్మెల్యేకు బహూకరించారు. దీంతో యువకుడ్ని ఎమ్మెల్యే ఎంతో అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, ఇట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మా రెడ్డి కృష్ణారెడ్డి,తదితరులు ఉన్నారు.