

కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి బాబు మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఈ సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గిరిబాబు కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా ఓదార్చారు.. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అందుబాటులో లేని కారణంగా ఎమ్మెల్యే సోదరుడు రాజా గిరి బాబు మృతదేహానికి నివాళులర్పించరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సోదరు రాజా ద్వారా గిరి బాబు కుటుంబ సభ్యులకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.. అలాగే గిరి బాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అలాగే ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అండగా ఉంటారని గిరి బాబు కుటుంబానికి భరోసా కల్పించారు.
