

మన న్యూస్, కోవూరు, మే 13: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల సంస్థ ఆలింకో కొడవలూరు మండలం వాసులకు వినికిడి యంత్రాలు మంజూరు చేసింది. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఎమ్మెల్యే నివాసంలో కొడవలూరు మండలం రెడ్డిపాళెం, మానేగుంట పాడు గ్రామాలకు చెందిన బధిరులైన పిండి తిరుపతయ్య, రుద్రకోట క్రిష్ణయ్య, మాల కొండయ్యలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వినికిడి యంత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల నాయకులు వినీల్ రెడ్డి, గునపాటి మధుసూదన్ రెడ్డి, మండల ఇంచార్జ్ ముంగమూరు శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
