
మన న్యూస్ ,నెల్లూరు, మే 13:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనాలను గతంలో ఏ విధంగా అయితే విఐపి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారో అదే తరహాలో ఇకపై కూడా టీటీడీ వారు ప్రత్యేక లేఖలను స్వీకరించుటకు నిర్ణయం తీసుకున్నారు..తదనగుణంగా వీఐపీ లేఖలను యధావిధిగా అనుమతించటానికి అవసరమైన చర్యలను చేపడుతున్నాం…దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మే 15వ తేదీ నుండి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై ఇకపై బ్రేక్ దర్శనాలను యధావిధిగా కేటాయిస్తూ పునః ప్రారంభిస్తున్నాం అని ఆనం రామనారాయణ రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.
