భూ వివాదాలు పరిష్కారమే రీ సర్వే లక్ష్యం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 13:- రీ సర్వే ద్వారా భూ క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టడంతో పాట భూ ఆక్రమణలను కూడా అరికట్ట వచ్చు. – పాత భూ రికార్డులను సరి చేసి రీ సర్వే వివరాల ప్రకారం రైతులకు కొత్త పాస్ బుక్ మంజూరు చేస్తారు. – రీ సర్వే వలన భవిషత్తులో ఎటువంటి భూ వివాదాలు రాకుండా ఉంటాయి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రైతులు అధికారులతో సహకరించి భూ రీసర్వే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు మండలం వేగూరు గ్రామంలో నిర్వహించిన రీసర్వే గ్రామసభలో నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష తో కలిసి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ …..ప్రస్తుతం 100 సంవత్సరాల క్రితం రూపొందించిన రికార్డులు ఆధారంగా భూ లావాదేవీలు నిర్వహిస్తున్నామన్నారు. అడ్వాన్సడ్ శాటిలైట్ టెక్నలాజితో నిర్వహించే లాండ్ రీసర్వే ప్రక్రియ ద్వారా ఒక గ్రామంలో ప్రభుత్వ భూములు ఎన్ని వున్నాయి పట్టా భూములు ఎన్ని వున్నాయి అనే లెక్క లెక్క తేలుతుందన్నారు. గ్రామాలలో భూవివాదాలు పరిష్కరించడమే.రీ సర్వే గ్రామసభ యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. ల్యాండ్ రీ సర్వే ద్వారా భూ క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టడమే కాకుండా, భూ ఆక్రమణలను కూడా అరికట్ట వచ్చన్నారు. ప్రజల ఆస్తి హక్కు కాపాడబడడం కోసమే ఈ భూ రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. రీ సర్వే అధికారులతో సహకరించి భూములకు సంబంధించి కచ్చితమైన కొలతలు వేసుకోవలసిందిగా ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. శాటిలైట్ అడ్వాన్స్ టెక్నలాజితో భూ హద్దులు నిర్ణయించి ప్రభుత్వమే భూములకు హద్దురాళ్లు ఏర్పాటు చేస్తుందన్నారు. పాత భూ రికార్డులలో ఏవైనా అవకతవకలుంటే సరి చేసి రీ సర్వే వివరాల ప్రకారం రైతులకు కొత్త పాస్ బుక్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే వలన భవిషత్తులో ఎటువంటి భూ వివాదాలు రాకుండా ఉంటాయన్నారు. శాస్త్రీయంగా జరుతున్న ఈ రీ సర్వే ప్రక్రియ పూర్తి అయ్యాక అధికారులు సేకరించిన భూ వివరాలను డిజిటలైజ్ చేస్తారని ఇప్పటిదాకా చెలామణిలో వున్న పాత సర్వే నెంబర్లు రద్దయి లేటెస్ట్ టెక్నలాజితో రూపొందించిన డిజిటల్ డైగ్లాట్ ప్రకారం రాబోయే రోజులలో భూ లావాదేవీలు నిర్వహణ జరుగుతుందన్నారు. రీ సర్వేకు సంబంధించి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు, అభ్యంతరాలు ఏవైనా వుంటే గ్రామసభలో పాల్గొన్న అధికారులు మీ సందేహాలను నివృత్తి చేస్తారని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, వేగూరు సర్పంచ్ కరేటి అమరావతి, తహసీల్దార్ నిర్మలానంద బాబా, రీసర్వే డిప్యూటి తహసీల్దార్ మధు, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, డిప్యూటి తహసీల్దార్ నాజర్, ఎంపిపి పార్వతి, కోవూరు టిడిపి అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, స్థానిక నాయకులు వేగూరు సుబ్బానాయుడు, దారా విజయబాబు, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బాలరవి, గుత్తికొండ వెంకయ్య, మల్లికార్జున నాగిరెడ్డి శ్యాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు