

హస్తినాపురం. మన న్యూస్ :- ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని జడ్పీ రోడ్ భవిష్య స్కూల్ పక్కన మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ చాంద్ పాషా నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బజార్ సూపర్ మార్కెట్ ను సోమవారం మాజీ వార్డ్ కమిటీ సభ్యులు మొహమ్మద్ సయ్యద్ పాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన వస్తువులను సరసమైన ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులు ఎండి నజీర్,ఎండి చాంద్ బాషా లకు సూచించారు.వచ్చిన వినియోగదారులకు ఒకే చోట ప్రతి వస్తువు లభించడం లో ఇండియన్ బజార్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్ గా 2000కు పైగా కొనుగోలు చేసిన వారికి 5% డిస్కౌంట్ ఇస్తామన్నారు.ఈ అవకాశాన్ని స్థానికులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో అల్తాఫ్, రమేష్, మోయిన్, హకీం తదితరులు పాల్గొన్నారు.
