

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం ,మే 11:బుచ్చిరెడ్డి పాళెం మండలం వవ్వేరు గ్రామంలో ఆదివారం వైభవంగా నిర్వహించిన త్రిపురాంతక స్వామి వారి కళ్యాణోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. కల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అలకరించిన శివ పార్వతుల దర్శనం చేసుకున్న అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు.కన్నుల పండుగగా జరిగిన శివ పార్వతుల కల్యాణాన్ని కనులారా వీక్షించారు. త్రిపురాంతక స్వామి ఆశీస్సులతో వవ్వేరు గ్రామంలో పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కోటంరెడ్డి లలితమ్మ, టిడిపి నాయకులు శివయ్య నాయుడు, జొన్నలగడ్డ శివప్రసాద్, వరలక్ష్మి, కంచెర్ల మురళి చౌదరి, చప్పిడి రాజమ్మ, కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
