నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్ రెడ్డి సారధ్యంలో ముమ్మరంగా సాగుతున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ వై.సి.పి కమిటీ ఆత్మీయ సమావేశాలు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 11:నెల్లూరు రూరల్ నియోజకవర్గం,26వ డివిజన్ మరియు 27వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని వారి నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ డివిజన్ ఇంచార్జ్ గా సురేంద్ర బాబు (బాబురావు) ని నియమించారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 27వ డివిజన్ ఇంచార్జ్ గా శ్రీ సి.హెచ్ మస్తాన్ రెడ్డి ని నియమించారు.ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…………..నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా పటిష్టమైన నిర్మాణాంతక కమిటీలు ప్రతి డివిజన్ లో ఏర్పాటు చేసుకుని తిరిగి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా చేసుకునే లక్ష్యం గా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి కార్యకర్త పని చేయాలని తెలియజేసారు.అలాగే ప్రతి నాయకుడు,ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి డివిజన్ కమిటీల్లో నిజంగా కష్టపడి వై.సి.పి అంటే అభిమానం ఉండే నిజమైన వై.సి.పి నాయకులు ని కార్యకర్తలని కమీటీ లో పదవులు వేయాలని డివిజన్ ప్రెసిడెంట్స్ కి సూచించారు.అదే విదంగా ఇప్పటి పరిస్థితుల్లో అధికారం లేకుండా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో పార్టీ కోసం నిలబడి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుని ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యం పరంగా ఎన్నో ఇబ్బందులు పడి కూడా ఈ కష్ట కాలంలో పార్టీకి సేవ చేస్తూ పార్టీ బలోపేతం కి కృషి చేస్తున్న ప్రతి నాయకుడని ప్రతి కార్యకర్త ని నా సొంత కుటుంబీకులు గా గుర్తించి వారి కోసం వారి సమస్యలు కోసం యందాక అయినా ఎవ్వరితోనైనా ఎదుర్కొని మీకు అండగా నిలబడటానికి నేను సిద్ధంగా ఉంటానని ఆనం విజయకుమార్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్ రావు (RSR),రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ శ్యామ్ సింగ్,జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి సునంద, నెల్లూరు రూరల్ నియోజకవర్గ, ఎంప్లాయస్ & పెన్షనర్స్‌ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి, మేధావి విభాగ అధ్యక్షుడు చంద్రమౌళి, వాణిజ్య విభాగ అధ్యక్షుడు సతీష్, పబ్లిక్ సిటీ అధ్యక్షుడు వినోద్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు పెంచలయ్య, అల్లంపాటి శ్రీధర్ రెడ్డి, రాజు, రమణారెడ్డి 26వ డివిజన్ మరియు 27వ డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు