నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం వేడుకలు

మన న్యూస్, నెల్లూరు ,మే 11:కొడుకు గొప్పవాడు అవ్వాలి ఎంత గొప్ప అంటే దానికి అంతే లేదు…అంతులేని ప్రేమను పంచుతున్న మహిళా మాతృ మూత్రులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మాతృ దినోత్సవం సందర్భంగా జనసేన నేత గునుకుల కిషోర్ తెలియజేశారు.మాతృ దినోత్సవ సందర్భంగా గత 14 రోజులుగా చిల్డ్రన్స్ పార్క్ సందు నెల్లూరు సిటీ డొక్కా సీతమ్మ పేరుపై ఉచితంగా మజ్జిగ పంపిణీ కేంద్రం వద్ద జనసేన పార్టీ వీర మహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో పలువురు మాతృమూర్తులకు సత్కరించి కొంతమంది తల్లులకు ఉచితంగా చీరలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ…..90లో చిన్నప్పుడు వడగళ్ల వాన వచ్చింది పెంకుటిల్లు పెంకులన్నీ లేచిపోయి నాన్న ఇంట్లో లేడు ముగ్గురు పిల్లల్ని ఓ మూలకు చేర్చి మంచం అడ్డం పెట్టి దాని మీద దుప్పటి కప్పి మా అమ్మ అడ్డంగా నిలుచుంది.అమ్మ అంటే ఇదే…ఈ విషయం మా గుండెలో నా మైండ్లో ముద్రించుక పోయింది అని అన్నారు.అంతులేని ప్రేమను పంచుతున్న అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.తన జీవితంలో పొందని వాటిని బిడ్డలకు సమకూర్చి వారి నుంచి ఏమీ ఆశించని జీవి ఒకటి ఉందంటే అది అమ్మ ఒక్కటే…. అని తెలియజేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దయవల్ల నాలుగు సంవత్సరాలు నుంచి ప్రజాసేవలో బిజీగా ఉన్నప్పటికీ బరువైన బాధ్యతని నాతో మోస్తున్నాను అదే మా అమ్మ ప్రేమ… అని అన్నారు.కొడుకు గొప్పవాడు అవ్వాలి ఎంత గొప్ప అంటే దానికి అంతే లేదు…అంతులేని ప్రేమను పంచుతున్న మహిళా మాతృ మూత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…. తెలియజేశారు.ఎంత బిజీగా ఉన్నప్పటికీ తల్లులను చూసుకోవాల్సిన బాధ్యతను బిడ్డలకు గుర్తు చేస్తూ ఈ రోజు మాతృ దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది అని అన్నారు.పిల్లల్ని వదిలేసిన తల్లులు చాలా అరుదుగా చూస్తుంటాం…తల్లులను వదిలేసిన పిల్లలను చాలా ఎక్కువగా చూస్తున్నాం… అని తెలిపారు.ముఖ్యంగా మన నుంచి ఆశించే ఈ మూడే… మాట వినబడే వరకు అమ్మ అనే పదం…. చూపు ఉన్నంతవరకు కంటి నిండా మన రూపం…జీవం ఉన్నంతవరకు మన చేతి స్పర్శ…. ఇవన్నీ వీలైనంత తరచుగా అందేటట్లు చూడండి….అది మన భాద్యత…. అని అన్నారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ……….అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు… తెలియజేశారు.అమ్మ అనే పదం ఎంత తినేదో నేను అమ్మాయి అయ్యే వరకు తెలియలేదు. ప్రతిక్షణం బిడ్డల క్షేమాన్ని కోరుకునే తల్లులు దైవరూపాలు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి తెలియదు అని అన్నారు.ఈ రోజు జనసేన పార్టీ వేదికగా పిల్లల కోసమే బతుకుతున్న ఎంతోమంది తల్లులను గుర్తు చేసుకుంటూ పిల్లలు అందరు కూడా ఎంత బిజీ గా ఉన్నా మీ తల్లుల్ని పలకరించండి,కలవండి… మీ ప్రేమని వ్యక్తపరచండి. తన కష్టాలను మర్చిపోయి మన ఇష్టాలను గౌరవిస్తూ మన అభివృద్ధి కోరుకునే తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు… తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ విజయలక్ష్మి,శ్యామల,లక్ష్మీ కుమారి,పసుమర్తి సుజాత,చల్లా కవిత,గల్లా కవిత,దూబిశెట్టి కళ్యాణి,గాయత్రి,లక్ష్మీకుమారి,సుగుణ,సునీత,శిల్ప,రజిని,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి,జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నెల్లూరు సిటీ నాయకులు గుర్రం కిషోర్,అనుదీప్,పేనేటి శ్రీకాంత్ తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు