

మన న్యూస్ ,నెల్లూరు ,మే 11: తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ జన్మదినం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ అజీజ్ కు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధ రెడ్డిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, జిల్లా మీడియా ఇన్చార్జి జలదంకి సుధాకర్, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, 18వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు పెనక శ్రీనివాసులు,టిడిపి నాయకులు కాకుపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.
