

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాళెం,మే 11:బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని రెయిన్ బో స్కూల్ లో నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై నారాయణ హాస్పిటల్ వారి ఉచిత వైద్య సేవలు పొందారు. ప్రయివేట్ హాస్పిటల్స్ కు వెళ్లి వేలకు వేలు ఫీజులు కట్టి మెరుగైన వైద్య సేవలు పొందలేని పేదలు నివసించే ప్రాంతాలలో నెలకో సారి ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ మున్సిపల్ వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్ ఖాన్, కౌన్సిలర్ పుట్ట లక్ష్మి కాంతమ్మ, బుచ్చి టిడిపి అర్బన్ మండల అధ్యక్షలు ఎంవి శేషయ్య, రియల్టర్ శ్రీనివాసులు, సుభహాన్ తదితరులు పాల్గొన్నారు.
