నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ-మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య

మన న్యూస్, తిరుపతి:తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల కొరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా కేంద్రాలలో శనివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయంలో భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని అన్నారు. గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జాతర, విశ్వరూప దర్శనం రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో రానుండడంతో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంగళవారం జాతర రోజు, విశ్వరూప దర్శనం రోజు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎంతమంది స్టేజ్ పైన ఉండాలి, తదితర విషయాలపై ఉత్సవ కమిటీ, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో చర్చించామని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రథమ చికిత్సా కేంద్రం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు అమ్మవారిని సంతోషంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎక్కడా తొందర పడకుండా ఓపిగ్గా అందరూ దర్శనం చేసుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, టిడిపి టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, టిడిపి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆవులపాటి బుజ్జిబాబు,డీఎస్పీ భక్తవత్సలం, సూపరింటెండెంట్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, ఆర్. ఓ. సేతుమాధవ్, ఆలయ ఈవో జయకుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///