

సిద్ధవటం న్యూస్ – మే 10:– సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కనుములోపల్లె సమీపంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం శనిత్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి ఏ. కుల రాజేశ్వరి రెడ్డి , “అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని, మీ జీవితం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని” ఆకాంక్షించారు.
