పైలాన్ కూలుస్తానని చెప్పి మరీ కూల్చింది నిజం కాదా?

మన న్యూస్, కావలి ,మే 8:- పడగొట్టిన వాళ్లు విలేకరులు అయితే కేసులు ఉండవా?- 2019 – 24 మధ్య కావలి లో భారత రాజ్యాంగం అమలైనదా?- మాజీ ఎమ్మెల్యే నటన చూసి కమల్ హాసన్ కూడా ఆశ్చర్యపోతాడు – మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పై మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు- ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు – ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథంఅమృత్ పథకం పైలాన్ ను కూలుస్తానని చెప్పి మరీ కూల్చింది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాదా? అని తెలుగు తమ్ముళ్లు అన్నారు. బుధవారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు మధుబాబు నాయుడు, తిరివీధి ప్రసాద్ దేవరకొండ శ్రీను, జనసేన నాయకులు సిద్దు తదితరులు మాట్లాడారు. అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో 2019లో కావలి పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి 100 కోట్ల వ్యయంతో చేపట్టిన అమృత్ పథకం పైలాన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 11, 2020న దానిని ధ్వంసం చేసి నామ రూపాలు లేకుండా, కనీసం శిధిలాలు కనబడకుండా వైసీపీ నాయకులు, కొంతమంది విలేఖరులు చేయడం జరిగిందని తెలిపారు. పైలాన్ కూల్చిన విలేకరులపై కేసులు పెట్టకూడదా? విలేఖరులు అయితే కేసులు ఉండవా? అని ప్రశ్నించారు. పైలాన్ ధ్వంసం చేసింది నిజమా? కాదా? మీ ప్రమేయంతో జరగడంతో ఆ కేసు దర్యాప్తు జరగకుండా కేసును మూసివేసింది మీరు కాదా? అని అన్నారు. 2019 – 24 మధ్య కాలంలో కావలిలో అసలు భారత రాజ్యాంగం నడిచిందా? అని ప్రశ్నించారు. దళితులపై, విలేకరులపై, సామాన్యుల పై దాడులు చేయించింది మీరు కాదా? అని అన్నారు. ప్రశ్నించిన అనేకమంది టిడిపి నాయకులపై అనేక కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పై ఉన్న అక్రమ కేసులు, వైసిపి నాయకుల పై ఉన్నాయా? అని ప్రశ్నించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని, 2019-24 ఒక చీకటి అధ్యాయం అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నటన చూస్తే కమలహాసన్ కూడా ఆశ్చర్యపోతాడని అన్నారు. డబ్బే వ్యామోహం గా పనిచేసిన ఏకైక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కావలికి చేసిన అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. పోలీస్, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుండి డబ్బులు వసూలు చేసిన ఘనుడు ప్రతాప్ రెడ్డి అని తెలిపారు. కరోనా సమయంలో వ్యాపారస్తుల నుండి భారీగా వసూళ్లు చేసిన ఘనత ప్రతాప్ రెడ్డి ది అని అన్నారు. రౌడీయిజం గురించి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారని, వడ్డీతో సహా చెల్లించడానికి తిరిగి ఆయన గెలిస్తే కదా అని అన్నారు. కూటమి పాలనలో 10 నెలల్లోనే అవినీతి జరుగుతుందని చెప్పటం విడ్డూరం అని అన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సొంత నిధులు వెచ్చించి ప్రజాసేవ చేస్తున్నారని, కక్ష తీర్చుకునే కార్యక్రమాలు చేపట్టడని అన్నారు. పది సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే చేయలేని అనేక అభివృద్ధి పనులను కావ్య క్రిష్ణారెడ్డి 10 నెలల కాలంలోనే చేశాడని గుర్తు చేశారు. కావలిని అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని, అందుకే పైలాన్ కూల్చిన చోటే 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను స్థాపించాడని తెలిపారు. జలదంకి ఎంపీపీగా క్రిష్ణారెడ్డి పోటీ చేసే సమయంలో పూర్తి మెజారిటీ ఆయనకే ఉన్నదని, కిడ్నాప్ లు చేసింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నదని, ప్రతి పథకం అమలు చేసి తీరుతుందని తెలిపారు. పైలాన్ ఘటనతో సంబంధం లేకుంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి శివాలయం కోనేరులో మునిగి చెప్పాలని అన్నారు. లేకుంటే వెంటనే పోలీసులకు సరెండర్ కావాలన్నారు. ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంతో కావలి పట్టణ ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రతి వార్డులో ఆయన పర్యటించి స్థానికంగా సమస్యలు తెలుసుకుంటూ సత్వరం పరిష్కరిస్తూ ఉన్నారని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు మాని కావలి అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, హజరత్, వల్లెరి వెంకట కిరణ్, అక్కిలగుంట సూర్య ప్రకాష్, అభిసాగర్, ఆళ్ల శ్రీను, అన్సర్, ఖమర్ బాబు, పైడి శ్రీహర్ష, అల్ హర్, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ముద్రగడ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాంట్రాక్టర్ కొత్తిం బాలకృష్ణ తండ్రి శ్రీరామ్మూర్తి ఇటీవల కాలంలో మరణించడంతో వారి కుటుంబాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

  • By JALAIAH
  • September 14, 2025
  • 2 views
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

  • By JALAIAH
  • September 14, 2025
  • 4 views
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…