

మన న్యూస్ ,కోవూరు ,మే 7 :- 2019 లో అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసింది. *ప్రభుత్వ హాస్పటల్లో కాన్పు చేసుకొనే తల్లులకు నాటి టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కీట్స్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తే,వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా నిలిపివేసింది.
*వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, బేబి కీట్స్ పథకాలను పునరుద్ధరించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కి ధన్యవాదములు.కోవూరు లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ……..2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం విదేశాలలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకంను ప్రవేశ పెట్టీ అమలు చేసింది.ఈ పథకం వలన అనేక మంది పేద విద్యార్థులు ప్రభుత్వం ఆర్థిక సహాయం తో విదేశాలలో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లారు అని అన్నారు.2019 లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్నీ పూర్తిగా నిలిపివేసింది అని తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితులలో ఈ పథకానికి జగనన్న విదేశీ విద్యా పథకం పేరు మార్చి, ఆచరణ సాధ్యం కాని అనేక నిబంధనలు పెట్టీ ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది అని అన్నారు.
2019 కి ముందు ఈ పథకం క్రింద ఎంపికై విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు తదుపరి చెయ్యవలసిన ఆర్థిక సహాయం కూడా వైసిపి ప్రభుత్వం చేయక పోవడంతో విద్యార్థులు తమ సొంత డబ్బులతో మిగిలిన చదువులు పూర్తి చేసుకున్నారు అని అన్నారు.ఎప్పుడు పేద ప్రజలు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు SC,ST,BC,EBC, మైనార్టీ, కాపు విద్యార్థులు కొరకు విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు అని అన్నారు.ఈ పథకానికి అంబేద్కర్ విదేశ విద్యా నిధి అని పేరు పెట్టాలని,ఈ పథకం క్రింద విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకొనే SC,ST విద్యార్థులకు రూ.25 లక్షలు,BC, మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షలు,EBC, కాపు విద్యార్థులు కు 15 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం చేయాలని,అదే విధంగా ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడేలా నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారాలను ఆదేశించారు.ఇంతటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.ప్రభుత్వ హాస్పిటల్స్ లో కాన్పులు చేసుకొనే తల్లులకు బేబి కీట్స్ ఇచ్చే పథకం ను నాటి తెలుగుదేశం ప్రభుత్వం 2016 జులై 1 వ తేదిన ఎన్టీఆర్ బేబి కీట్స్ పేరుతో ప్రవేశపెట్టింది.ఈ పథకం క్రింద బేబి ల సంరక్షణ కొరకు ఉపయోగపడే 11 రకాల వస్తువులను నాటి ప్రభుత్వం ఉచితంగా అందించింది.అయితే ఈ పథకాన్ని కూడా వైసిపి ప్రభుత్వం వైఎస్ఆర్ బేబి కీట్స్ అని పేరు మార్చి కొద్ది రోజులు అమలు చేసి 2021 నుండి నిలిపి వేసింది అని అన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ లో కాన్పు చేసుకొన్న పేదల పిల్లలు ఎంతో ఉపయోగపడే బేబి కీట్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని అన్నారు.దీని వలన ప్రతి ఏడాది దాదాపుగా 4 లక్షల మంది తల్లులకు మేలు జరుగుతుంది.రూ.1410 రూపాయల విలువ గలిగిన 11 వస్తువులను ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుంది అని తెలిపారు.
