

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 6: అఖిల భారత యువజన సమాఖ్య బద్వేలు పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లె ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు మరియు యువత హక్కుల పైన మరియు స్థానిక సమస్యల పైన భవిష్యత్ పోరాటాలు చేసేందుకు కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు ఈనెల 15 నుండి 18 వరకు aiyf జాతీయ మహాసభలు తిరుపతిలో జరుగుతున్నాయని దేశంలో ఈ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు యువత హక్కులు మరియు ఉపాధి పైన భవిష్యత్ కార్యాచరణ కు ఈ మహాసభలు వేదిక కానున్నాయని ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా యువత వేలాదిగా పాల్గొంటున్నారని మన జిల్లా నుండి కూడా యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ అధ్యక్ష,కార్యదర్శులతో పాటు మరో తొమ్మిది మందితో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు.