ఎన్ సి సి కేడేట్లకు ట్రాఫిక్ నియమాలపై ఉపన్యాసం

మన న్యూస్, నెల్లూరు,మే5: 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్ అక్షర విద్యాలయ నందు గత ఎనిమిది రోజులు నుంచి నిర్వహింపబడుతున్నది.ఈ క్యాంపులో శారీరక వ్యాయామం,యోగాసనాలు, పెరేడ్ ట్రైనింగ్, యాంకర్ వర్క్, వెపన్ ట్రైనింగ్, నేవల్ ఓరియంటేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైరింగ్, పర్సనాలిటీ డెవోలెప్మెంట్,షిప్ మోడలింగ్,నేవల్ ఓరియంటేషన్,సీమాఫోర్, బోట్ వర్క్,కమ్యూనికేషన్, లీడర్షిప్ తదితర విషయాలపై శిక్షణ నిచ్చారు.అంతే కాకుండా కేడేట్లకు “రహదారి భద్రత నియమాలు” అంశంపై నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ హరికృష్ణ,రమేష్ పోలీస్ కాన్స్టేబుల్ పాల్గొని ఉపన్యసిస్తూ ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అప్పుడే ప్రమాదాల బారిన పడకుండా అందరం సురక్షితంగా జీవించగమని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడుపరాదని, లైసెన్స్, ఆర్ సి లేకుండా వాహనాలు నడుపుట నేరమని,మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయరాదని, పద్దెనిమిదేళ్లు నిండని వారు వాహనాలు నడుపుటకు అనర్హులని, పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు నడుపుటకు అనుమతించిరాదని, అలా అనుమతిస్తే వారు వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలు వాహనాలు నడిపే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు, సీటు బెల్ట్ ధరించకుండా కార్లు నడుపరాదని, రోడ్లు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్స్ దగ్గర మాత్రమే రోడ్లు దాటాలని, రోడ్లుపై ఆటలు ఆడారాదని ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించారు. కేడేట్లకు స్క్వాడ్రాన్ వారీగా, డ్రిల్, ఫైరింగ్, ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల స్కిట్ పోటీలు నిర్వహించారు. ఫైరింగ్ కంపిటీషన్ లో 25 పాయింట్లకు గాను డి. లోహిత్ సాయి 24 పాయింట్లు, అఖిల్,ప్ర సంహీరా 23 పాయింట్లు, తాహీర్ 22 పాయింట్లు, సుశాంత్, బతుల్ 21 పాయింట్లు, వశిష్ట 20 పాయింట్లు సాధించారు. వారిని క్యాంపు కమాండెంట్ గణేష్ గొదం గవే అభినందించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్సిసి క్యాంపు అడ్జటెంట్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు,సబ్ లెఫ్ట్నెంట్ మల్లికార్జున రెడ్డి,థర్డ్ ఆఫీసర్లు మస్తానయ్య, కొండారెడ్డి,విద్యా సాగర్, అరోరా, సాయి శంకరి,దివ్య,
పి ఐ స్టాఫ్ వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్, పెట్టీ ఆఫీసర్లు రంజన్, లోకేష్, లక్ష్మణ్, దీపక్,వెంకటేష్, రమణారావు, నవీన్, ఈశ్వర రావు, ఆఫీస్ సూపరింటెండెంట్ ముకుంద సాగర్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ ఎస్. వి. రామన్, కార్యాలయ సిబ్బంది షెహనాజ్ బేగం, కల్పన, సుజాత, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 600 మంది ఎన్ సి సి కేడేట్లు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా