

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 5: నెల్లూరు రూరల్ లో 20వ మరియు 23వ డివిజన్ ఆత్మీయ సమావేశంకి గాలి,వాన సైతం లెక్కచేయకుండా కదిలి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు ఆదివారం సాయంత్రం 20వ మరియు 23వ డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.రెండు డివిజన్స్ నాయకులు కార్యకర్తలు సమావేశం సమయానికి గాలి వాన వచ్చినా లెక్క చేయకుండా ఆ వర్షంలోనే భారీ గా డివిజన్ కమిటీ సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ……………..
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రతి ఒక్క వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అంకిత భావం తో దృఢ సంకల్పంతో పార్టీ బలోపేతం దిశగా పని చేసి చేసి 2029 లో మళ్ళీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని నాయకుల కి తెలియపర్చారు ప్రతీ నాయకుడికి ప్రతి కార్యకర్తకి అధికార పార్టీ వల్ల వచ్చే అన్ని సమస్యలపై అన్ని విధాలా పార్టీ పరంగా సపోర్ట్ గా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో,వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున 20వ డివిజన్ ఇంచార్జ్ గా వాసంతి రెడ్డి ని,మరియు 23వ డివిజన్ ఇంచార్జ్ గా మల్లికార్జున్ రెడ్డిని,స్థానిక నాయకుల,కార్యకర్తల అభీష్టం మేరకు వారి సలహా సూచనలు తీసుకుని డివిజన్ అధ్యక్షులు గా నియమించడం జరిగింది.ప్రతి ఒక్క నాయకుడు మరియు ప్రతి కార్యకర్త వై.ఎస్.ఆర్.సిపి పార్టీ బలోపేతానికి,వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టించి పని చేసి మన పార్టీ గెలుపే లక్ష్యం గా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్ రావు (RSR),నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ,ఎంప్లాయస్ & పెన్షనర్స్ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు రమాదేవి,ఇక్బాల్, రసూల్,రూప్ కుమార్,గోపాల్ రెడ్డి,సుధీర్ డ్డి,ఏడుకొండలు,రూపేష్,వెంకట ప్రకాష్,హరి రెడ్డి,శివప్రసాద్ రెడ్డి,ఇన్నారెడీ,శివారెడ్డి,శ్రీనివాసులురెడ్డి,పెంచల రెడ్డి,నారాయణ రెడ్డి,మాల్యాద్రి, 20వ డివిజన్ మరియు 23వ డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
