

- టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యం నిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్..
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక సగర కాలనీ సమీపంలో ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి పూలదండలు వేసి ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ, జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికతల వికాసం జరుగుతుందని ఉద్ఘాటించారు. ప్రజల శ్రేయస్సు కోసం గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన భారతీయ సంప్రదాయానికి గొప్ప ముద్ర వేశాయని అభివర్ణించారు… భగీరథుని స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ప్రాధాన్యతగా తీసుకుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సాకారం చేసి భగీరథుని కలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం మన సంస్కృతిపై గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బుర్ర వాసు, గ్రామ ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, మాజీ ప్రజా ప్రతినిధి ములికి వెంకన్న, సగర సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.