

గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :– రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, సీ.ఎం.ఆర్ కొనుగోలు, ఈ క్రాఫ్ నమోదు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మరియు అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో మండల కేంద్రం గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాల యం వద్ద ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, జిల్లా నాయకులు డి నారాయణమూర్తి ల నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ ధర్నాకు ఏపీ ఆర్ సి ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షు లు వల్లూరి రాజబాబు పాల్గొ ని మాట్లాడారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లాలోని రైస్ మిల్లర్స్ సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతుల ను దోపిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. చాలాచోట్ల రైతులు ఈ క్రాఫ్ నమోదు చేసుకోకపోవడం, అవగాహన లేమితో తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఒకవైపు వాతావరణం అనుకూలంగా లేకపోవడం అదునుగా చూసుకుని రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, జిల్లా లో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలపై దృష్టి సారించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) నాయకులు డొక్కులూరి సంగీత, రెడ్డి దుర్గాదేవి, పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య కన్వీనర్ బొచ్చ యేసు ఏఐఎఫ్టీయూ మరియు ఏపీ ఆర్ సి ఎస్ నాయకులు గుడాల చార్లెస్, బల్ల సోమరాజు, వేగిశెట్టి గణేష్ తదితరులు నాయకత్వం వహించారు.
