మోడల్ ఆస్పత్రిగా పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం……. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

మన న్యూస్, సర్వేపల్లి ,మే 4:ఏడు మండలాల ప్రజలకు ఉపయోగపడేలా డయాలసిస్ సెంటర్.
*కోరిన వెంటనే పొదలకూరుకు ఈ సౌకర్యాన్ని కల్పించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ధన్యవాదములు. *టీడీపీ కూటమి ప్రభుత్వంలో చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం.

సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించినారు.సత్యకుమార్ యాదవ్ తో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పొదలకూరు మండల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భముగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ………………పొదలకూరులో పెద్దలు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించుకున్నాం అని అన్నారు.ఇప్పుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో డయాలసిస్ సెంటర్ ప్రారంభించుకున్నాం అని తెలిపారు.ఒక్క పొదలకూరు మండలమే కాదు రాపూరు, సైదాపురం, చేజర్ల, మనుబోలు, కలువాయి, సంగం మండలాల్లోని ప్రజలకు ఈ డయాలసిస్ సెంటర్ ఎంతో ఉపయోగపడనుంది అని అన్నారు.రోగుల అవసరాల నేపథ్యంలో కోరిన వెంటనే డయాలసిస్ సెంటర్ మంజూరు చేసి, ఈ రోజు ప్రజలకు అంకితం చేసిన సత్యకుమార్ యాదవ్ కు ధన్యవాదములు తెలియజేశారు.డయాలసిస్ సెంటర్ కు ముఖ్య అవసరమైన జనరేటర్ తో పాటు అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తున్నాం అని అన్నారు.పొదలకూరు, వెంకటాచలం సీ.హెచ్,సీలకు జనరేటర్లు, కంప్యూటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు తదితర సామగ్రి అందజేయబోతున్నాం అని తెలిపారు.రూ.1.85 కోట్లు సీఎస్ఆర్ నిధులతో సీఈఐఎల్(సెంబ్ కార్ప్) కంపెనీ ఆయా పరికరాలను అందిస్తోంది అని అన్నారు.ఈ నిధులతో నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలోనూ ఆర్వో ప్లాంట్లు, ఫర్నీచర్, వాటర్ డిస్పెన్సరీలు తదితర సామగ్రి అందుబాటులోకి రానున్నాయి అని తెలియజేశారు.పొదలకూరులోని 30 పడకల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కోరాం ,సదరం సర్టిఫికెట్ల జారీ కోసం ఆర్థోపెడిక్ వైద్యుడిని నియమించాలని కూడా విన్నవించాం అని అన్నారు.ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ఈ ఆస్పత్రి రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉంది అని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగింది అని అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ఆస్పత్రులకు ఒక రూపు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం అని అన్నారు.నా స్వగ్రామం అల్లీపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నవలాకులతోటలో జెడ్పీ హైస్కూలుకు 4 ఎకరాల స్థలాన్ని మా కుటుంబమే ఇచ్చింది. ఈ రోజు ఆ భూముల విలువ రూ.30 కోట్ల పైమాటే అని తెలియజేశారు.

Related Posts

బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని అయ్యప్పస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన జిల్లా (ఒంగోలు కేంద్రం) బాల వికాస్ కేంద్రాల మాతాజీలు, అర్చకస్వాముల సమావేశానికి సమరసత సేవా ఫౌండేషన్ సింహపురి జోన్ ధర్మప్రచారక్ ఊరిమిండి వెంగలరెడ్డి ముఖ్య…

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

  • By JALAIAH
  • September 14, 2025
  • 2 views
బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి