

- రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి భారీ ఘన విజయానికి కార్యచరణ…
- ముదునూరి రాకతో నరసాపురం పార్లమెంట్ ప్రజల సంతోషం వ్యక్తం…
- వైఎస్ఆర్సిపి పార్టీ లో చురుగ్గా పనిచేస్తున్న ముదునూరి కి గణ సన్మానం..*
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్సీపి ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణ రాజు నరసాపురం పార్లమెంట్ సమన్వయ కమిటీలో నియమితులైన సందర్భంగా నరసాపురం పార్లమెంటు లో ముదునూరి మురళీ కృష్ణంరాజు పర్యటించారు. పరిశీలికలుగా మొట్ట మొదట సారి గా మురళిరాజు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి గ్రామస్థాయి నుండి నియోజవర్గ స్థాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మురళిరాజు పిలుపునిచ్చారు. ఏడు నియోజకవర్గాల్లో రానున్న సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ జెండా ఎగరవేయాలని మనం అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని, గ్రామస్థాయి నాయకులు నుండి నియోజవర్గ నాయకులు వరకు కష్టపడి పనిచేసే నాయకులను ప్రజల తరఫున నిలబడి ప్రజల కష్టసుఖాలు నిలబడే నాయకులను రాష్ట్ర పార్టీ గుర్తించి వారికి సుభిక్ష స్థానం కల్పించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడతారని మురళీ కృష్ణంరాజు మీడియా పూర్వకంగా తెలియజేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి వారిని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 2.0 లో జగన్మోహన్ రెడ్డి మొట్ట మొదటి తీసుకునే నిర్ణయం కార్యకర్తలు సంక్షేమం ద్యేయంగా పనిచేస్తారని మురళీకృష్ణ రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని నిరుపేదలకు యువతకు మహిళలకు రైతన్నలకు కార్మికకులుకు అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందని, వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు,ఉండి సమన్వయకర్త పి.వి.ఎల్ నరసింహ రాజు,పాలకొల్లు సమన్వయకర్త గుడాల గోపి, ఎమ్మెల్సీ కౌవురు శ్రీనివాస్,ఎంపీపీలు, జడ్పిటిసిలు, పార్లమెంట్ సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ వివిధ అనుబంధ సంఘ అధ్యక్షులు సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.