

అహ్మదాబాద్, మన న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నూర్ భాషా, ముస్లిం (దూదేకుల) సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కోటేగంటి నబి రసూల్, ఆయన తనయుడు కోటేగంటి జావిద్ భాష, అలాగే సంతోష్ కుమార్, విజయ్ విక్రమ్, రాజన్న తదితరులు టికెట్ తీసుకుని స్టేడియాన్ని సందర్శించారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి పేరెంట్స్, ఉద్యోగులు, యువత, రిటైర్డ్ అధికారులూ పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వచ్చిన వారు క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన నరేంద్ర మోడీ స్టేడియం ఈ సందర్భంగా 1,40,000 మందికి పైగా అభిమానులను ఆహ్వానించింది. ప్రేక్షకుల ఉత్సాహం, ఆటలో ఉత్కంఠ భరితమైన మలుపులు ఈ క్రికెట్ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చాయి.
