

తిరుపతి, మన న్యూస్: డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసి బి) చైర్మన్‌గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డిని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని అమాస రాజశేఖర్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి, తనయుడు హితేష్ కుమార్ రెడ్డి కలిసి చైర్మన్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రెండు కుటుంబాల మధ్య సానుకూలమైన సంభాషణలు జరిగాయి. తాజా బాధ్యతలతో డిసిసి బి బ్యాంక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు