

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో 20 గేట్ల సమీపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపల పిల్లల కార్యక్రమానికి ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యేతో కలిసి చాప పిల్లలను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ..
రాష్ట్రంలోని మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మత్స్యకారులకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. మత్స్యకారులు చేప పిల్లలను కాపాడుకుని మంచి జీవనోపాధి పొందాలని సూచించారు. తెలంగాణ మరో భగీరధుడు రేవంత్ రెడ్డి గా పిలవడం జరుగుతుందన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా జుక్కల్ సమస్యలపై ప్రతి ఒక్క నాయకులతో మంత్రులతో కలసి జుక్కల్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. గాలి మాటలు కార్యకర్తలు ఎవరు కూడా నమ్మకూడదన్నారు. ఈ సమస్య ఉన్న ఎమ్మెల్యేకు అడిగే హక్కు ఉంది ఆయనకు ఇచ్చే ధైర్యం ఉంది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర చైర్మన్ ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటాను సాయి కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే.మల్లికార్జున్, అనీష్ పటేల్,మల్లయ్య గారి ఆకాష్,రాము రాథోడ్,గజ్జల కిరణ్,గౌస్ పటేల్,చిట్యాల నారాయణ,సంకు లక్ష్మయ్య,జిల్లా మత్స్యకారుల అధికారి త్రిపతి,తహసిల్దార్ బిక్షపతి,ఎంపిడిఓ గంగాధర్, జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ,ప్రాజెక్టు మత్స్యకరుల అధ్యక్షుడు బొయి రాములు,తదితరులు పాల్గొన్నారు.