

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు వేడుకలను ఆస్పత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శైలజ పుష్పగుచ్చం ఇచ్చి చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సూపర్డెంట్ శైలజ మాట్లాడుతూ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజేష్ అయిన తర్వాత నిరంతరం ఆస్పత్రి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎన్ రఘుపతి, కే లావణ్య, టిడిపి నాయకులు బుగతా శ్రీనివాసరావు, సామంతుల గోపి,అనంతారపు రాజు, మామిడి శ్రీను,సిరి ఫుడ్ కృష్ణ, దేవకి హరికృష్ణ,వాగు బద్రి,వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు,హెడ్ నర్స్ జి. పరిమళా కుమారి,సిబ్బంది చక్రవర్తి, గోడతా రాజు తదితరులు పాల్గొన్నారు.