

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 02 : ఎనిమిది గంటల పని అమలుకు 44 కార్మిక చట్టాలు పునరుద్దరణ, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు కోరుతూ మేడే ఉద్యమ పోరాట స్ఫూర్తితో సంఘటిత పోరాటాలకు కార్మికులు సమాయత్తం కావాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి లేవాకు నాగ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మేడే వేడుకలు ఏఐటీయూసీ కడప జిల్లా బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల అరుణపతాకాలు ఆవిష్కరించి సభలు సమావేశాలు నిర్వహించి పట్టణంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. సెంటర్లో నాలుగు రోడ్డు కోడలి నందు ఏర్పాటుచేసిన సభలో ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి లేవాకు నాగు సుబ్బారెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను కట్టుబానిసలను చేస్తుందన్నారు. కార్మికులు జీవించే హక్కు హరిస్తూ నాలుగు లేబర్ కోడ్ లు తేవడం జరిగిందన్నారు. అంతర్జాతీయ కార్మిక చట్టాలు, న్యాయ సూత్రాలు ఉల్లంఘిస్తూ ఎనిమిది గంటల పనికి తిలోదకాలిస్తూ 12 గంటలు పనికి అమలుకు పూనుకుంటుందన్నారు. ఇది పూర్తిగా దేశంలో 70 కోట్ల మందికి పైగా వున్న కార్మికులను కట్టు బానిసలను చేయడం తప్ప మరొకటి కాదన్నారు. కార్పోరేట్, బడా పెట్టుబడిదారుల సంక్షేమమే లక్ష్యంగా కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి కార్మికులకు తీరని ద్రోహం తలపెడుతుందన్నారు. ఎనిమిది గంటల పని హక్కు పరిరక్షణ, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు కోరుతూ ఈనెల 20 న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు గుంటి వేణు, మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు వి వీరశేఖర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఏరియా కార్యదర్శి పి.వి రమణ, ఏఐటిసి పట్టణ కార్యదర్శి ఇర్ల నాగేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు పడిగ వెంకటరమణ కార్యదర్శి ఇమ్మానుయేల్, గోపవరం మండల కార్యదర్శి పెంచలయ్య, వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశం,పోరుమామిళ్ల ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి పీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జెర్రీ అధ్యక్షుడు పి నాగరాజు, మున్సిపల్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున, మధు శ్రీను, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు జయమ్మ జయలక్ష్మి, లక్ష్మీదేవి, వెంకటసుబ్బమ్మ మహిళలు కార్మికులు నాయకులు పాల్గొన్నారు.