పేద‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవడానికే పెన్ష‌న్లు- ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్, తిరుపతి:– పేద‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవడానికే ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌ను పంపిణీ చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. బుధ‌వారం ఉద‌యం కొర్ల‌గుంట సంజ‌య్ గాంధీ కాల‌నీలోని రామాల‌యం వ‌ద్ద 8,9 డివిజ‌న్ల‌కు సంబంధించిన‌ ల‌బ్దిదారుల ఇంటింటికి వెళ్ళి పెన్ల‌ను ఆయ‌న అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్ర‌కారం పెంచిన పెన్ష‌న్ ఇచ్చి మాట నిలుపుకున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌కే ద‌క్కింద‌ని అన్నారు. తిరుప‌తిలో 18,666 మంది పెన్ష‌న‌ర్స్ కు ఎనిమిది కోట్ల ఇర‌వై లక్ష‌ల ప‌ద‌కొండు వేల ఐదు వంద‌ల రూపాయ‌లు అందించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు పెంచ‌డానికి ఐదేళ్ళు ప‌ట్టింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బ‌ట‌న్ నొక్కుడు పేరుతో స‌గం మందికి పెన్ష‌న్ల‌ను ఇవ్వలేదని ఆయ‌న ఆరోపించారు. పేద‌లంద‌రికి ఆర్థిక తోడ్పాటు అందించ‌డ‌మే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ క‌మిష‌నర్ అమ‌రయ్య‌, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రుద్రకోటి సదాశివం, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///