

మన న్యూస్: పినపాక, అశ్వాపురం మండలంలో ఆదివారం తెల్లం వెంకటరమణ అధ్యక్షతన,జరిగిన అమేర్థ డబల్ బెడ్ రూమ్ నందు సిపిఐ పార్టీ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాపోరాటాలతోనే మండలంలో రోజు రోజుకు సీపీఐ కి జనాదరణ వస్తుందని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ అన్నారు. డిసెంబర్ 26 నాటికి పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో గ్రామ గ్రామాన వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పార్టీ చరిత్రను, త్యాగాలను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, బస్తీలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. 2025 సభ్యత్వ చేర్పింపు, పునరుద్ధరణ లక్ష్యాలను పూర్తిచేసి గ్రామ స్థాయి, మండల స్థాయి మహాసభలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు. సిపిఐ వందేళ్ళ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
సీపీఐ సహాయ కార్యదర్శులు, రాయపూడి రాజేష్, ఈనపల్లి పవన్ సాయి, చెలికాని శ్రీనివాస్, మహిళా నాయకులు, తేజావత్ జయమ్మ, బెజ్జనంపోయిన నాగమణి, వినోద్, రవి, తదితరులు పాల్గొన్నారు…