

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని స్థానిక గ్రంథాలయ గ్రంథపాలకుడు కవికొండల సత్యనారాయణ అన్నారు.
రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ.కృష్ణమోహన్ ఆదేశాలతో ఏలేశ్వరం నందు గ్రంధాలయం నందు నిర్వహిస్తున్న నాలుగవ రోజు వేసవి విజ్ఞాన తరగతులలో భాగంగా గురువారం నాడు ఉపాధ్యాయుడు మామిడి రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం కథలు వ్రాయుట,నీతి పద్యాలు పటించడం, వాటి భావాలు అవపోసన పట్టడం వంటి విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారని ఆయన తెలిపారు.